10-03-2025 10:15:16 AM
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు(Parliament budget session 2025 ) ప్రారంభం కానున్నాయి. రెండో విడత సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మణిపుర్ లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంట్ అమోదం కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మణిపుర్ బడ్జెట్ ప్రతిపాదనలను లోక్ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) ప్రవేశపెట్టనున్నారు. మణిపుర్ హింసాకాండపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్దమయ్యాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు(Waqf Bill) సహా పలు కీలక బిల్లులను ఆమోదించాలని కేంద్రం భావిస్తోంది.
నేడు రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు(Railway Amendment Bill),త్రిభువన్ సహకారీ బిల్లును కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సహకార సంఘాల్లో పనిచేసేవారికి శిక్షణ అందించేందుకు త్రిభువన్ సహకారీ బిల్లు. నియోజకవర్గాల పునర్విభజన, నకిలీ ఓటర్లు జాబితా అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాదిపై రుద్దడంపై ప్రతిపక్షాలు(Opposition parties) ఆందోళనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అటు భారత్ పై అమెరికా టారిఫ్ లు విధించడంపై కూడా ప్రతిపక్షాలు ఆందోళనకు సిద్ధమైయ్యాయి.