calender_icon.png 31 March, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిధిలాల కింద చిక్కిన రెండవ మృతదేహం లభ్యం

28-03-2025 08:59:48 AM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam)లో ఈనెల 26వ తారీఖున కుప్పకూలిన ఆరంతస్తుల భవనం శిధిలాల లో చిక్కిన మరో వ్యక్తి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు లభ్యమైంది. గురువారం తెల్లవారు జామున అదే సమయంలో చల్లా కామేశ్వరరావు ను కొన ఊపిరితో ఉన్న అతన్ని సహాయక బృందాలు వెలికి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే.

సరిగ్గా 24 గంటల అనంతరం రెండో వ్యక్తి మృతదేహం లభ్యం మైంది. లంబాడా కాలనీకి చెందిన వడిశల ఉపేందర్ గా గుర్తించారు .  ఈనెల 26న మధ్యాహ్నం 2.30 గంటలకు నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో 48 గంటల పాటు చేపట్టిన సహాయ చర్యల  ఫలితంగా ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదిలా ఉండగా గురువారం సహాయక చర్యలు నిర్వహిస్తున్న క్రమంలో బీరువా బయటపడింది.. దాంట్లో బంగారపు, వెండి వస్తువుల తో పాటు విలువైన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.