calender_icon.png 22 September, 2024 | 1:15 AM

డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం

16-09-2024 10:09:43 AM

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని, ఫ్లోరిడా క్లబ్ లో గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ పై కాల్పులకు యత్నించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) తెలిపింది. తక్షణమే స్పందించిన సీక్రేట్ సర్వీస్ ఏజెంట్లు దుండగుడిపై ఎదురు కాల్పులు జరిపారు.

దీంతో దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అమెరికా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. "అధ్యక్షుడు ట్రంప్ తన పరిసరాల్లో తుపాకీ కాల్పులను ఎదుర్కొని సురక్షితంగా ఉన్నారు.  అని ట్రంప్ ప్రచార కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియుంగ్ ఆ వెంటనే ఒక ప్రకటనలో తెలిపారు. కాల్పులపై స్పందించిన ట్రంప్ ఎప్పటికీ లొంగిపోనని ప్రకటించారు. జూలై 13న, పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు జరపగా, అతని చెవిలో బుల్లెట్ దూసుకుపోయింది. ఎనిమిది రోజుల తర్వాత, డెమోక్రటిక్ ప్రెసిడెంట్ జో బిడెన్ రేసు నుండి వైదొలిగారు, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పార్టీ నామినీగా మారిన విషయం తెలిసిందే.