- 20 ఏండ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు
- రెగ్యులర్ కావాలంటే ఆన్‌లైన్ పరీక్ష రాయాలంటున్న ప్రభుత్వం
- పరీక్షతో సంబంధం లేకుండా రెగ్యులర్ చేయాలని వినతి
నిర్మల్, డిసెంబర్ 2౨ (విజయక్రాంతి): జిల్లా ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న రెండో ఏఎన్‌ఎమ్‌లకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారింది. 2003లో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ఏఎన్‌ఎంల కోసం కాంట్రాక్టు పద్ధతిలో నియామకం చేపట్టింది.
ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్షలు నిర్వహించి మెరిట్ ప్రతిపాదికన 350 మం దిని ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండో ఏఎన్‌ఎమ్‌లు విధులు నిర్వహిస్తున్నారు. మొదట్లో వీరికి రూ.6,800ల వేతనం చెల్లించేవారు.
20 ఏండ్లుగా కాం ట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, వేతనాలు పెంచాలని ఎన్నో సార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు అందించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు సమ్మె చేసిన అధికారులు హామీలు ఇవ్వడమే తప్ప రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వయస్సులో పరీక్షలు రాయమంటే ఎలా?
రాష్ట్రంలోని ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న ఆరోగ్య కార్యకర్తల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 3,255 పోస్టులను భర్తీ చేయాలని ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,000 మంది వరకు రెండో ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించబోతోంది.
అయితే ఇందులో ఆరోగ్య కార్యకర్తల కోర్సు పూర్తి చేసిన వారికి అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు రెండో ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న వారు కూడా తప్పనిసరిగా పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధిస్తేనే వారికి రెగ్యులర్ ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం సూచించింది. 20 ఏండ్లుగా ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వహిస్తున్న తమకు పరీక్ష నిర్వహించడం ఏమిటని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న తమకు ఇపుడు పరీక్ష పెట్టి తమ సర్వీస్‌ను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని రెండో ఏఎన్‌ఎం సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే 20 ఏండ్ల సర్వీస్‌కు 20 మార్కుల వెయిటేజీతో పాటు రోస్టర్ ప్రకారం ఎంపిక పక్రియ ఉంటుందని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.
అయితే తాము ఇప్పటి వరకు చేసిన సర్వీస్‌ను గుర్తించి తమను రెగ్యులర్ చేసి మిగతా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని రెండో ఏఎన్‌ఎంలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చాలా మందికి ఆన్‌లైన్ పరీక్ష విధానంపై అవగాహనం లేకపోవడం, సిలబస్ మొత్తం ఇంగ్లి ష్‌లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నా రు.
మరో 10 సంవత్సరాల్లో ఉద్యోగ విరమ ణ చేయనుండగా ప్రభుత్వం పరీక్షల పేరిట పొమ్మనలేక పొగపెడుతోందని రెండో ఏఎన్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం వెంటనే తమ సమస్యలను గుర్తించి పరీక్షతో సంబంధం లేకుండా రెగ్యులర్ చేయ డంతో పాటు, వేతనాలు పెంపు, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ తదితర సౌకర్యాలు కల్పిం చాలని కోరుతున్నారు.
సీఎంపైనే ఆశలు..
గత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, మాజీ ఆరో గ్య శాఖ మంత్రి హరీష్ రావు తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినా అమలులోకి మాత్రం రాలేదని రెండో ఏఎన్‌ఎంలు వాపో తున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం వసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించారన్నారు.
ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న రేవంత్ సర్కార్ పరీక్షకు సంబంధం లేకుండా తమ సర్వీస్‌ను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తా మంటున్నారు.
పరీక్ష వద్దే వద్దు..
వైద్యారోగ్యశాఖలో 20ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్నాం. రె గ్యులర్ ఏఎన్‌ఎంలతో సమానంగా ప్రభుత్వం అప్పజెప్పే ప్రతీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ప్రస్తుతం మాకు రూ.27,500 వేతనం మాత్రమే వస్తోంది. రెగ్యులర్ ఏఎన్‌ఎంలతో సమానంగా మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. అలాగే పరీక్షతో సంబంధం లేకుండా రెగ్యులర్ చేయాలి.
లతీఫా, ఆరోగ్య కార్యకర్త, నిర్మల్