calender_icon.png 15 January, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్వీ, సీఎండీ పార్థ్ధసారథిలకు సెబీ నోటీసులు

08-08-2024 02:43:38 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 7: క్లెయింట్ల నిధుల్ని దుర్వినియోగం కేసులో రూ.25 కోట్లు చెల్లించాలంటూ కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీ ఎల్), ఆ సంస్థ సీఎండీ పార్థ్ధసారథిలకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ బుధవారం నోటీసులు జారీచేసింది. గతంలో సెబీ విధించిన అపరాధ రుసుంను చెల్లించకపోవడంతో తాజాగా 15 రోజుల్లో చెల్లించాలంటూ నోటీసులు జారీఅయ్యాయి. 2023 ఏప్రిల్‌లో కేఎస్‌బీఎల్, పార్థసారథిలను మార్కెట్ నుంచి ఏడేండ్లు నిషేధం, రూ.21 పెనాల్టీని సెబీ విధించింది. కేఎస్‌బీఎల్ రూ.13 కోట్లు, పార్థ్ధసారథి రూ. 8 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంది. తాజాగా వడ్డీ, రికవరీ వ్యయా లతో కలిపి కేఎస్‌బీఎల్ రూ.15.21 కోట్లు, పార్థసారథి రూ.9.36 కోట్లు చెల్లించాలం టూ నోటీసులు జారీ అయ్యాయి.