calender_icon.png 8 January, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏథర్ సహా 6 ఐపీవోలకు సెబీ గ్రీన్ సిగ్నల్

31-12-2024 12:19:05 AM

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఏథర్ సహా మరో ఐదు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 10నుంచి 23 మధ్య ఆయా కంపెనీలు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించగా తాజాగా సెబీ ఆమోదం తెలపింది. సెబీ ఆమోదం తెలిపిన కంపెనీల్లో  ఏథర్ ఎనర్జీ, ఐవాల్యూ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్, ఓస్వాల్ పంప్స్.

క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్, స్లోస్ బెంగళూరు లెమిటెడ్ ఉన్నాయి. లీలా ప్యాలెసెస్ హోటల్స్, రిసార్ట్స్ పేరిట హోటళ్లు, రిసార్ట్‌లు నిర్వహిస్తున్న స్లోస్ బెంగళూరు లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా  రూ.5 వేల కోట్లు సమీకరించనుంది.

ఇందులో రూ.3 వేల కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించనుంది. ఆతిథ్య రంగంలో ఇదే అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది. అలాగే టూవీలర్ ఈవీలు తయారు చేసే ఏథర్ ఎనర్జీ రూ.3,100 కోట్లు  మార్కెట్‌నుంచి సేకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.