calender_icon.png 18 October, 2024 | 11:52 AM

హ్యుందాయ్ మెగా ఐపీవోకు సెబీ గ్రీన్‌సిగ్నెల్

26-09-2024 12:04:41 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్‌కి భారత సబ్సిడరీ హ్యుందాయ్ మోటార్ ఇండి యా లిమిటెడ్ మెగా ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది.

భారత్ మార్కెట్లో హ్యుందాయ్ మోటా ర్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేయడం ద్వారా 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,000 కోట్లు) సమీకరించాలని కొరి యా ఆటో దిగ్గజం భావిస్తున్నదని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి.

ఐపీవోను ఆమోదించినట్లు సెబీ నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి ప్రతిపాదిత మొత్తాన్ని సమీకరిస్తే ఇండియాలో ఇప్పటివరకూ వచ్చిన పబ్లిక్ ఆఫర్లు అన్నింటికంటే హ్యుందాయ్ ఐపీవో అతిపెద్దదిగా నిలుస్తుంది. రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూను మించుతుంది. 

రెండు దశాబ్దాల తర్వాత ఆటోమొబైల్ పబ్లిక్ ఆఫర్

ఆఫర్‌ను ప్రతిపాదిస్తూ హ్యుందాయ్ మోటార్ ఈ ఏడాది జూన్ నెలలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ ప్రాస్పెక్టస్ ప్రకారం ప్రమోటింగ్ సంస్థ  హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన సబ్సిడరీలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూట్లో 14.22 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. తాజా ఈక్విటీ షేర్లను జారీచేయదు.

భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది. 2003వ సంవత్సరంలో మారు తి ఐపీవో తర్వాత ఆటోమొబైల్ ఐపీవో హ్యుందాయ్‌దే అవుతుంది. ప్రస్తుతం ఇండియాలో కార్ల తయారీలో మారుతి తర్వాత హ్యుందాయ్ ద్వితీయస్థానంలో ఉన్నది.

1996లో హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌లో వ్యాపార కార్యకలాపాల్ని ప్రారంభించింది. ప్రస్తుతం వివిధ సిగ్మెంట్లలో 13 రకాల మోడల్స్‌ను విక్రయిస్తున్నది.