calender_icon.png 5 October, 2024 | 8:50 PM

బుచ్ రాజీనామా కోరుతూ సెబీ ఉద్యోగుల ఆందోళన

06-09-2024 12:00:00 AM

ముంబై, సెప్టెంబర్ 5: మార్కెట్ రెగ్యు లేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధబిపురి బుచ్ రాజీనామా కోరుతూ సెబీ కేంద్ర కార్యా లయం వద్ద ఆ సంస్థ ఉద్యోగులు ఆందో ళనకుదిగారు. మీడియాతో ఉద్యోగులె వరూ మాట్లాడనప్పటికీ, నిరసనలో పాల్గొన్న అధికారులు ఒక లేఖను పంపి ణీ చేశారు. సెబీ బుధవారం విడుదల చేసిన ప్రకటనను ఉపసంహరించుకో వాలని, బుచ్ రాజీనామా చేయాలం టూ ఆ లేఖలో డిమాండ్ చేశారు. పలు వైపులనుంచి ఆరోపణలను ఎదుర్కొం టున్న తరుణం లోనే బుచ్‌కు సొంత ఉద్యోగుల నిరసన సెగ తగిలింది. 

ఇదీ నేపథ్యం..

బుచ్ సెబీ చైర్మన్ పదవి చేపట్టిన ప్పటి నుంచి సంస్థ పని విధానం కలుషి తం అయిపోయిందని ఆరోపిస్తూ ఆగస్టు 6న 500 ఉద్యోగులు ఆర్థిక శాఖకు లేఖ రాశారు. యాజమాన్యం భారీ లక్ష్యాల్ని నిర్దేశించడం, వాటిని చేరలేకపోతే పది మందిలో దూషించడం, అరవడం చేస్తా రంటూ ఆ లేఖలో ఆర్థిక శాఖకు ఫిర్యా దు చేశారు. ఆ లేఖ వివరాలు మీడియా లో వెల్లడికావడంతో సెబీ బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ బయటి వ్యక్తుల ప్రోద్భలంతో కొందరు ఉద్యోగులు ఈ లేఖ రాశారని, అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టివేసింది. ఈ తరహాలో సెబీ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలం టూ సెబీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు.