ఉద్యోగులపై వ్యతిరేక ప్రకటన ఉపసంహరణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: తమ ఉద్యోగులు జరిపిన నిరసన ప్రదర్శన బయటి వ్యక్తుల ప్రోద్భలంతో జరిగిందంటూ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొద్ది రోజుల క్రితం జారీచేసిన ప్రకటనను ఉపసంహరించుకుంది. సోమవారం తాజాగా సెబీ ఒక ప్రకటన విడుదల చేస్తూ తమ ఉద్యోగుల పాత్రను గుర్తిస్తున్నామని, వారి ఆందోళనల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
అన్ని గ్రేడ్ల ఆఫీ సర్లతో నిర్మాణాత్మకంగా సమస్యలను చర్చించామని, ఆ సమస్యలు పూర్తిగా అంతర్గత మైనవని, సంస్థ పాలనా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీతకాలంలో పరిష్కరించుకుంటామని సెబీ ఆ ప్రకటనలో వివరిం చింది. ఈ మేరకు సెప్టెంబర్ 4న జారీచేసిన పత్రికా ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.
ఇదీ నేపథ్యం
వారం రోజుల క్రితం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్‌పర్సన్ మాధబిపురి బుచ్ రాజీనామా కోరుతూ సెబీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సెబీ ఉద్యోగులకు వ్యతిరేకంగా విడుదల చేసిన ప్రకటనను ఉపసం హరించుకోవాలని, బుచ్ రాజీనామా చే యాలంటూ మీడియాకు సర్క్యులే ట్ చేసిన లేఖలో డిమాండ్ చేశారు. అంతక్రితం బుచ్ సెబీ చైర్మన్ పదవి చేపట్టినప్పటి నుంచి సంస్థ పని విధానం కలుషితం అయిపోయిందని ఆరోపిస్తూ ఆగస్టు 6న 500 ఉద్యో గులు ఆర్థిక శాఖకు లేఖ రాశారు.
యాజమాన్యం భారీ లక్ష్యాల్ని నిర్దేశించడం, వాటిని చేరలేకపోతే పదిమందిలో దూషించడం, అరవడం చేస్తారంటూ ఆ లేఖలో ఆర్థిక శాఖ కు ఫిర్యాదు చేశారు. ఆ లేఖ వివరాలు మీడియాలో వెల్లడికావడంతో సెబీ ఒక ప్రకటన విడుదల చేస్తూ బయటి వ్యక్తుల ప్రోద్భలం తో కొందరు ఉద్యోగులు ఈ లేఖ రాశారని, అవన్నీ తప్పుడు ఆరోపణలు అంటూ కొట్టివేసింది. ఈ తరహాలో సెబీ చేసిన ప్రకట నను ఉపసంహరించుకోవాలంటూ సెబీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేశారు.