calender_icon.png 25 September, 2024 | 7:55 AM

స్విగ్గీ ఐపీవోకు సెబీ ఆమోదం

25-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం నిర్వహిస్తున్న స్విగ్గీ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి లభించింది. స్విగ్గీ దాఖలు చేసిన కాన్ఫిడెన్షియల్ ప్రాస్పెక్టస్ పత్రాలకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అప్‌డేట్ చేసిన మరో రెండు ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను సమర్పించాల్సి ఉన్నదని, వాటికి ఆమోదం లభించిన తర్వాత ఇష్యూ జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్విగ్గీ ఐపీవో నవంబర్‌లో రావొచ్చని అంచనా. పబ్లిక్ ఆఫర్ ద్వారా  1-1.5 బిలియన్ డాలర్ల మేర నిధుల్ని సమీకరిస్తుందని భావిస్తున్నారు.