calender_icon.png 23 February, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శెభాష్ కానిస్టేబుల్ - గుండెపోటుకు గురైన వ్యక్తికి సకాలంలో సీపీఆర్

21-02-2025 12:00:00 AM

ఉన్నతాధికారుల అభినందన 

రాజేంద్రనగర్ (కార్వాన్) ఫిబ్రవరి 20: ఓ కానిస్టేబుల్ సకాలంలో సిపిఆర్ చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరి ధిలో గురువారం ఉదయం జరిగింది. వివ రాలు.. నానల్ నగర్ సమీపంలోని ఫ్లోర్ మిల్ దగ్గర  కానిస్టేబుల్ సంతోష్ బైక్ పై వెళ్తుండగా స్కిడ్ అయి కింద పడింది. అత డు గుండెపోటుతో పడిపోయాడు.

విషయం తెలుసుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ నరేష్ వెంటనే స్పందించి సిపిఆర్ చేయ డంతో అతడు స్పృహలోకి వచ్చాడు. అత డిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంతోష్ కి సకా లంలో సిపిఆర్ చేయడంతోనే ప్రాణాలతో బతకాడని వైద్యులు తెలిపారు. సిపిఆర్ చేసిన కానిస్టేబుల్ నరేష్ ను ఉన్నతాధి కారులు అభినందించారు.