calender_icon.png 9 February, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని పార్టీలు 52 శాతం సీట్లు ఇవ్వాలి

08-02-2025 06:49:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): అన్ని రాజకీయ పార్టీలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 52 శాతం సీట్లు ఇవ్వాలని బీసీ కులాల పోరాట సమితి జిల్లా కన్వీనర్ అడిసర్ల రాజు డిమాండ్ చేశారు. శనివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ నిర్వహించిన కులగనుల సర్వేలో బీసీలను 47% గా చూపడం సర్వేపై అనుమానాలు ఉన్నాయని దీనిపై ప్రభుత్వం పునాలలోచన చేయాలని కోరారు. బీసీల జనాభా 52 శాతం ఉంటుందని మంత్రులై ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్, చిన్నయ్య, అనిల్ తదితరులున్నారు.