ఫిబ్రవరి 4 : తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవం
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చితీరుతుంది
- ప్రతిపక్షాలు కూడా అందుకు సిద్ధమా
- రాజ్యాంగ సవరణతోనే చట్టం చేసే అవకాశం
- 2011 జనాభా లెక్కలు తప్ప ఇంతవరకు అధికారిక లెక్కలే లేవు
- మోదీ ప్రధాని అయ్యాక జనాభా లెక్కలే లేవు
- కుల సర్వే నివేదికకు సభ ఆమోదం
- దేశవ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలి
- అసెంబ్లీలో తీర్మానం
- తీర్మానాన్ని కేంద్రానికి పంపించిన ప్రభుత్వం
- ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం
- శాసనసభ నిరవధిక వాయిదా
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని.. కానీ అలా అవకాశం లేకపోతే పార్టీపరంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తుందని ఈ వేదిక నుంచి తను మాటిస్తున్నానని ఆయన అన్నారు.
ఈ విషయంలో తను పీసీసీ అధ్యక్షుడి మాట తీసుకునే ఈ సభకు వచ్చానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు బీసీలకు ఇస్తుందని.. ఇది తమ కమిట్మెంట్ అని.. మరి బీఆర్‌ఎస్, బీజేపీ 42 శాతం సీట్లు ఇస్తా యా అని ప్రశ్నించారు. ‘చట్టబద్ధంగా అవకాశం వచ్చినప్పుడు ఇద్దాం. కానీ రాజకీయంగా, నైతికంగా కట్టుబడి 42 శాతం సీట్లు బలహీన వర్గా లకు సీట్లు ఇద్దాం..
ఇందుకు ఈ మీ రెండు పార్టీలు సిద్ధమా లేదా అసెంబ్లీ వేదికగా చెప్పాలి అని సీఎం చాలెంజ్ చేశారు. కుల సర్వే-2024 నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశం లో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటివ రకు సహేతుకమైన సమాచారం లేదని, దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందని సీఎం తెలిపారు.
1931 తర్వాత దేశంలో ఇప్పటివరకు బలహీనవర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదన్నారు. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదన్నారు. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ రాష్ర్టంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు.
కులగణన ప్రక్రియను పూర్తిచేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామని అన్నారు. ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారని వివరిం చారు. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామన్నారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారని తెలిపారు.
రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామని అన్నారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టామని... 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందిం చడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాని సీఎం తెలిపారు.
శంకర్‌ను ఖరాబ్ చేస్తున్నారు..
సర్వేలో పాల్గొననోళ్లు వెనకాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే శంకర్‌ను పాడుచేస్తున్నరని... ఆయన మంచివాడేనని ఆయనను కూడా ఖరాబ్ చేస్తున్నరని సీఎం అన్నారు. మోదీకి ముందు వరకు జనాభా లెక్కింపు జరిగిందని.. ప్రధానిగా మోదీ వచ్చిన తర్వాత ఇంత వరకు కేంద్రం జనాభా లెక్క లు చేయలేదని, వారికి బీసీలకు సాయంచేయడం వారికి ఇష్టం లేదన్నారు.
సమగ్ర కుటుంబ సర్వే చేసిన బీఆర్‌ఎస్ పార్టీ దాన్ని త్రిజోరీలో దాచిపెట్టి ఎన్నికలప్పుడు ఈ లెక్కలను వాడుకున్నారని అన్నారు. ఎస్‌కేఎస్ అధికార డాక్యుమెంట్ కానేకాదని అన్నారు. ఒక కుటుంబ రాజకీయ ప్రయోజనాల కో సం ఆ డాక్యుమెంట్‌ను దాచుకున్నారని అ న్నారు. మేం 50 రోజుల పాటు సర్వే నిర్వహించి వందకు వంద శాతం పారదర్శకంగా పూర్తిచేశామన్నారు.
2011 జనాభా లెక్కలు తప్ప ఆ తర్వాత అధికారిక లెక్కలు లేవని సీఎం అన్నారు. 2024లో చేపట్టిన సర్వే మాత్రమే అధికారిక డాక్యుమెంట్ అని అన్నారు. ఇలాంటి డాక్యుమెంట్లు చూపిస్తే సమాజాన్ని, సభను తప్పుదారి పట్టించడమేనని తెలిపారు. రాహుల్ గాంధీ ఉక్కు సంక ల్పానికి అందరూ సహకరించాలని కోరారు. అర్థం పర్థం లేని కాగితాలు తీసుకువచ్చి సభను తప్పుదారి పట్టించవద్దన్నారు.
16 లక్షల కుటుంబాల సర్వే చేయలేదని ఆయన తెలిపారు. 3 లక్షల పైచిలుకు కుటుంబాలకు గాను సర్వేలో పాల్గొనని నలుగు రైదుగురు ఇక్కడే ఉన్నారని కేటీఆర్, హరీష్ రావులను చూపుతూ అన్నారు. ఎందుకు వివరాలు ఇవ్వలేదో సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. ప్రజల ప్రైవసీని దృష్టిలో పెట్టుకుని సర్వే సమాచారం మొత్తం బయట పెట్టలేమ ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సర్వే ద్వారా కులగణననుకు సంబంధించిన వివరాలన్నింటినీ సభకు అందచేశామని అన్నారు. ప్రతిపక్షం అడగకపోయినా తాము సభలో చర్చ ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. చర్చ అనంతరం శాసనసభ కుల సర్వే నివేదికను ఆమోదించింది.
తీర్మానం..
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ మరియు కుల సర్వేను నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు (బీసీ), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది.
రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు, అఫెర్మెటివ్ పాలసీలను రూపొందించడానికి తెలం గాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఎదురుచూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం.
దేశంలోని వివిధ కులా ల సంబంధిత స్థితిగతులను ఆర్థం చేసుకోవడానికి, తెలంగాణలో నిర్వహించిన విధం గానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వేను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తున్నది.
సభ నిరవధిక వాయిదా
కుల సర్వే 2024, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలిపిన తర్వాత రాత్రి 9.35 గంటలకు అసెంబ్లీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిరవధికంగా వాయిదా వేశారు. మండలిలో రెండు బిల్లులు ఆమోదం పొందిన తర్వాత సభను చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాయిదా వేశారు.
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం
ఫిబ్రవరి 4కు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సభనుద్దేశించి ప్రసంగించారు. ఎస్సీల్లోని ఉప కులాలకు చెందాల్సిన రిజర్వేషన్ల కోసం చాలా కాలంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేబినెట్ ఆమోదం, వెంటనే అదే రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం గొప్ప విషయమన్నారు.
ఇది తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఆయన అభివర్ణించారు. ఏటా ఫిబ్రవరి 4ను గుర్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంత్రులు, కేబినెట్ ఉప సంఘం, అధికారులు ఎంతో శ్రమించి ఈ వ్యవ హారానికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేశారని వారందరనీ అభినందనలు తెలిపారు.
మంత్రులు, సభ్యులు కేటీఆర్, అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని, పాయల్ శంకర్, కవ్వంపల్లి సత్యనారాయణ, కడియం శ్రీహరి, వివేక్, వేముల వీరేశం, లక్ష్మణ్ కుమార్, మం దుల శామేలు, లక్ష్మీకాంతరావు, కాలే యాదయ్య, రాకేష్ రెడ్డి, బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పార్టీలకతీతంగా సభ్యులంతా చర్చలో పాల్గొని మద్ద తు తెలిపారని, వారం దరికీ అభినందలు అన్నారు.
సభ్యులంతా విజ్ఞత ప్రదర్శిం చి జఠిలమైన సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు సహకరించారని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానాన్ని తిరస్కరించడం ద్వారా భవిష్యత్తులో సమస్య లేకుండా ఏబీసీ కేటగిరీ అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసుకున్నామని అన్నారు. సభలో ఆమోదంతో పాటు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.
వర్గీకరణ అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చట్టబద్ధత తీసుకువచ్చి సంపూర్ణంగా అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. వర్గీకరణ పోరులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆశయం నెరవేరేలా చేశామన్నారు. ఇకపై ఎవరూ ఈ అంశంలో త్యాగాలు చేయాల్సిన అవసరం లేదన్నారు.
రాబోయే జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. బీసీల కులగణన, ఎస్సీల వర్గీకరణ విషయంలో ఇతర రాష్ట్రాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం సహ కరిస్తుందన్నారు. రాత్రి 9.30 గంటలు దాటినా సభను సజావుగా నడిపి ఇంత గొప్ప బిల్లులను ఆమోదించినందుకు స్పీకర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని సీఎం పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా కుల సర్వేను నిర్వహించాలి
అసెంబ్లీలో తీర్మానం.. కేంద్రానికి పంపించిన ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్యా, రాజకీయ, కుల సర్వేను దేశ వ్యాప్తంగా కూడా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ చివ రలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. శాసనసభ ఏకగ్రీవంగా చేసిన, కేంద్రానికి పంపించిన తీర్మానం ఇలా ఉంది..
* మేం రాజకీయాల కోసం కులగణన చేయలేదు. ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నదే మా సంకల్పం.. రాష్ట్రవ్యాప్తంగా బీసీలు 56 శాతం, ఎస్సీలు 17.46 శాతం ఉన్నారు. మొత్తంగా 73.5 శాతం ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం.. సిరిసిల్లలో ఉప ఎన్నిక వస్తుందా? ఎందుకు?.. అక్కడి ఎమ్మెల్యే కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటారా?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
(కమిటీ హాలులో మీడియాతో సీఎం చిట్‌చాట్)
అపోహలు వద్దు
- బీసీ జనాభా అంకెలపై అనుమానాలొద్దు
- సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం
- అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): కులగణన సర్వే నివేదికపై మంగళవారం అసెంబ్లీ వాడివేడి చర్చ జరిగింది. 2014లో బీఆర్‌ఎస్ చేసిన సమగ్ర సర్వేతో పోల్చితే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనలో బీసీల సంఖ్య తగ్గిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేసిన అభ్యంతరాలపై ప్రభుత్వం దీటుగా సమాధానం చెప్పింది.
మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జనాభా ఎక్కడా తగ్గలేదన్నారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో 3.70కోట్ల మంది జనాభా ఉన్నట్టు తేలిందన్నారు. 3.54కోట్ల మంది ప్రజలు సర్వేలో పాల్గొన్నట్లు వివరించారు. అంకెలపై ఎంలాటి అనుమానాలు అవసరం లేదన్నారు. ప్రజల్లో అపోహలను సృష్టించొద్దని హితవు పలికారు. సద్విమర్శలు చేస్తే తీసుకుంటామని వెల్లడించారు.
అవసరమైతే సర్వే జరిగిన తీరుపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అలాగే ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకోవడానికీ సిద్ధమేనన్నారు. సర్వేలో ప్రతి ఇంటికీ మార్కింగ్ వేసినట్టు వెల్లడించారు. జాతీయ జనగణన కూడా అంత పకడ్బందీగా చేయలేదన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపుదామన్నారు.
జనగణన సర్వేలో కులాల వారీగా వివరాలు తెలిసేందుకు అవకాశం ఉండదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. కులగణన సర్వే ద్వారా బీసీల లెక్క తేలడంతోపాటు వారి ఆర్థిక స్థితులూ తెలిశా యన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించినట్టు స్పష్టం చేశారు. దీని ద్వారా బీసీల పట్ల తమకున్న చిత్తశుద్దిని చాటుకున్నామన్నారు.