హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): బీఫార్మసీలో మొత్తం 10,692 (96.7 శాతం) సీట్లు భర్తీ చేసినట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. శుక్రవారం తుది విడత సీట్లను కేటాయించినట్టు చెప్పారు. మొత్తం 11,060 సీట్లలో 10,692 సీట్లు భర్తీ కాగా, ఇంకా 368 సీట్లు మిగిలినట్టు పేర్కొన్నారు.
బీఫార్మసీలో 96.1 శాతం, ఫార్మ్ 99.6 శాతం, బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో 100 శాతం, ఫార్మస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 96 శాతం, బయోటెక్నాలజీలో 98.4 శాతం సీట్లు నిం డినట్టు వివరించారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 12లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు.