హైదరాబాద్ : తెలంగాణ ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయించారు. వైబ్ సైట్ లో విద్యార్థులకు సీట్ అలాట్ మెంట్ ఆర్డర్లను అందుబాటులో ఉంచారు. కాలేజీ సీట్ల కోసం 96 వేల మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఇచ్చారు. కన్వీనర్ కోటాలో 78,694 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, 75,200 సీట్లు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 89 ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి. అందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ రీలేటెడ్ కోర్సుల్లో 53,890 సీట్లు ఉంటే 53,517 సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్టుల్లో 16,344 సీట్లు ఉంటే 15,127 సీట్లు కేటాయించారు. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 7,339 సీట్లు ఉంటే 5,686 సీట్లు కేటాయించారు.