calender_icon.png 27 October, 2024 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్ 1న సీటెట్

18-09-2024 12:00:00 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): టీచర్ వృత్తిని ఎంచు కునే వారి కోసం నిర్వహించే సెంట్ర ల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రతీ ఏడా ది రెండుసార్లు సీటెట్  నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఓఎమ్‌ఆర్ ఆధా రితంగా నిర్వహిస్తారు. రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. మొదటి పేప ర్ 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికి, రెండో పేపర్ 6 నుంచి 9వ తరగతి బోధించాలనుకునే వారికి నిర్వహిస్తారు.

సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. 20 భాషల్లో 136 పట్టణాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే పరీక్షను నవంబర్ 30న కూడా నిర్వహించే అవకాశం ఉందని సీటెట్ డైరెక్టర్ తెలిపారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.