calender_icon.png 24 December, 2024 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలుష్యం వల్లే సీజనల్ వ్యాధులు!

20-09-2024 12:00:00 AM

డెంగీ వ్యాధి సోకిన వ్యక్తి రక్తాన్ని దోమలు పీల్చి, మరొకరికి కుట్టినప్పుడు వాటిద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అందువల్ల డెంగీ బారినపడ్డ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాకాలం కారణంగా డెంగీ పం జా విసురుతున్నది. అకాల వర్షాలతో వ్యర్థాలు, జంతువుల కళేబరాలు కొట్టుకొచ్చిన కారణంగా దోమల బెడద కూడా తెలంగాణలో ఎక్కువై  వైరల్ ఫీవర్, చికున్ గున్యా, డెంగీ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏటా వర్షాల అనంతరం చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తుతుంది. దీంతో డెంగీ కేసులు అంతకంతకూ పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఇటీవల కురిసిన జడివానతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రం అతలా కుతలం అయ్యింది. ఏటా వర్షాకాలంలో  మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, ఫైలేరియా వంటి వాటితో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు.

దోమలు, ఈగల ద్వారా వ్యాపించే వ్యాధులు గ్రామీణుల జీవితాలను కష్టాల్లోకి నెట్టుతున్నాయి. నీటి కాలు ష్యంతో అతిసారం, టైఫాయిడ్ వంటి వ్యా ధులు సంభవిస్తున్నాయి. దేశంలో తాగునీటి వనరులు కలుషితమై ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని అంచ నా. అధిక శాతం ప్రజానీకానికి తాము వినియోగించే నీటి నాణ్యత గురించి సరైన అవగాహన లేదని నిపుణులు చెబుతున్నారు. సురక్షిత తాగునీరు లభిస్తే అతిసా రానికి అడ్డుకట్టపడి 25 శాతం, పారిశు ద్ధ్యం మెరుగుపడితే 32 శాతం చొప్పున మరణాలు తగ్గుతాయని ఐక్యరాజ్యసమితి లోగడ మదింపు వేసింది. అనుకోని ప్రకృతి విపత్తు వల్ల వ్యాధులను నివారించడానికి ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేయక తప్పడంలేదు.  

విపత్తు సమయంలో తెలంగాణ ప్రభు త్వం ప్రభుత్వ సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు చర్య లు తీసుకుంది. అయినా గత పక్షం రోజులుగా డెంగీ కేసుల సంఖ్య 6000 మార్కు ను దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు చివరి వారంలో డెంగీ కేసుల సం ఖ్య 5,372 గా ఉండగా, కేవలం 15 రోజుల్లోనే 1000 కేసులు నమోదయ్యాయి. డెంగీ కారణంగా ఎటువంటి మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో జనం ఆస్పత్రులకు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 40 కోట్ల మంది డెంగీ బారిన పడుతున్నట్లు గణాంకాలు చెప్పుతున్నాయి దాదాపు నలభై వేల మంది ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు.

కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమబెంగాల్ వంటి చోట్ల నిజమైన డెంగీ మరణాలను బయటకు వెల్లడించడం లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. 1996లో డెంగీ భారీగా ప్రాణనష్టం కలిగించింది. ప్రతి వినాయకుని నిమజ్జనం సీజన్లో రద్దీ ఎక్కువగా ఉండడం మూలాన కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనక తప్పలేదు. గ్రామాల్లో డెంగీని గుర్తించడం ఆలస్యం అయి, వ్యాధి ముదిరి ప్రాణాలకు ముప్పు తలెత్తుతుంది. రాజకీయాలకు పోకుండా ప్రభుత్వాలు, ప్రజలు సమిష్టిగా కృషి చేసినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది. గత పదేళ్లుగా భారత్‌లో డెంగీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

వాతావరణ కారకాలచే ప్రభావితమైన హోస్ట్, వెక్టర్, వైరస్ మధ్య సంక్లిష్ట పరస్పర చర్యల ద్వారా డెంగీ విలయతాండవం చేస్తుంది. డెంగీ వ్యాధి సోకిన వ్యక్తి రక్తాన్ని దోమలు పీల్చి, మరొకరికి కుట్టినప్పుడు వాటిద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అందువల్ల డెంగీ బారినపడ్డ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగీ నియంత్రణలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ 2017లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. డెంగీ వ్యాధికి ఇప్పటిదాకా కచ్చితమైన ఔషధం, టీకాలు లేవు. దీన్ని కట్టడి చేయాలంటే దోమల నియంత్రణ ఒక్కటే మార్గం.

డెంగీ విజృంభణపై ప్రజల్లో అవగాహన కల్గించడం ద్వారా దోమల ఉత్పత్తిని నియంత్రించ వచ్చని అంటున్నారు. ఇందులో 20 శాతం పిల్లలు అవగాహన లేకపోవడం వల్లనే వ్యాధి బారిన పడాల్సి వస్తున్నది. మిగిలిన 80 శాతం కేసులలో అవగాహన వల్ల నయం అవుతుందనే వాదం వినిపిస్తుంది. సీజనల్ వ్యాధులతో పాటు వర్షాల ఉద్ధృతికి, వ్యర్థాలతో రోగుల సంఖ్య పెరగడం వల్ల ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక కార్పోరేట్ ఆస్పత్రులను బతికించే పని క ల్పిస్తున్నారు. కీళ్లనొప్పులు, జలుబు వంటి చిన్నపాటి రుగ్మతలకు సైతం మందుల కొరత ఉందనే అభిప్రాయం ఉంది.

స్వచ్ఛభారత్‌ను మొక్కుబడిగా కాకుం డా నలు చెరగులా విస్తరించేలా ఉద్యమ రూపంలో నిర్వర్తిస్తే పరిశుద్ధమైన భారతదేశాన్ని ఆవిష్కరిస్తే మహాత్ముడు కలలు కన్న ఆరోగ్యవంతమైన దేశాన్ని చూడడం పెద్ద సమస్య కాదు. గ్రామ పంచాయితీలలో ఘ న, ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించాలి. నెలల త రబడి డ్రైనేజి శుభ్రం చేయని మున్సిపల్ కార్పొరేషన్లను,  పరిశుభ్రత పాటించని ప ట్టణాలను సైతం స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తున్నారు. నాటి ప్రభుత్వం జిల్లాకో మెడి కల్ కళాశాలతో పాటుగా అనుబంధ ఆస్పత్రులను ఏర్పాటు చేసినప్పటికీ, సరిపడా సిబ్బంది లేక అరకొర వసతులతో ఆశించిన ఫలితం రాలేదు.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, ప్రాథమిక వైద్యం అం దించడానికి రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పౌ రసమాజం కోరుతుంది. దేశం వైరల్  ఫీవర్‌తో సతమతం అవుతున్న నేపథ్యంలో డెంగీ వ్యాప్తిని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా విమర్శించడం విడ్డూరంగా ఉంది. దేశంలో 157 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చినా నోరు మెదపని రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్క తెలంగాణలోనే వైరల్ ఫీవర్స్, డెంగీ ఉన్నట్లుగా ప్రచారం చేయడం వెనక రాజకీయాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

 డా. సంగని మల్లేశ్వర్