30-04-2025 12:00:00 AM
10 మందిపై కేసు నమోదు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): అక్రమ వడ్డీ వ్యాపారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఏ ఎస్ పి చిత్తారంజన్ హెచ్చరించారు. మంగళవారం ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏఎస్పీ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలో 15 బృందాలు ముకుమ్మడిగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న పలువురి ఇండ్లలో ఉదయం ఐదు గంటల నుండి పోలీసులు సోదాలు నిర్వహించారు.
పది మందిపై కేసు నమోదు చేయడంతో పాటు 11 లక్షల రూపాయలను సీజ్ చేశారు.వారి వద్ద ఉన్న బ్లాక్ చెక్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బాండ్ పేపర్స్, ప్రామిసరీ నోట్స్, ఏటీఎం కార్డులను స్వాధీనపరుచుకున్నారు.
అక్రమ వడ్డీ వ్యాపారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏ.ఎస్.పి హెచ్చరించారు. అక్రమ వ్యాపారాలపై పోలీస్ శాఖ నిఘా పెంచడం జరుగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో 4 గురు సిఐలు, 8 మంది ఎస్‌ఐలు, 50 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.