న్యూఢిల్లీ, నవంబర్ 9: జార్ఘండ్ ఎన్నికల వేళ సీఎం హేమంత్ సోరెన్ పీఏ సునీల్ శ్రీవాత్సవ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. రాంచీ, జంషెడ్‌పూర్‌లలో ఈ తనిఖీలు కొన సాగుతు న్నాయి. మొత్తంగా 9 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నట్ల జాతీ యా మీడియాలో కథనాలు వెలువడతున్నాయి. ఈనెల 13, 20 తేదీల్లో రెండు దశల్లో జార్ఘండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి రాజకీయంగా ఘర్షణ వాతా వరణం నెలకొంది.
ఇలాంటి సమయంలో సీఎం పీఏ ఇంట్లో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారి ంది. ఈ యేడాది జనవరిలో మనీలాండరింగ్ కేసులో సీఎం సోరెన్‌ను అరెస్టు చేశారు. ఏడు నెలలపాటు జైలు జీవితం గడిపి జూన్‌లో బెయిల్‌పై బయటికి వచ్చారు. ఎన్నికల వేళ సన్నిహితులపై ఆదాయపు ప న్నుశాఖ దాడు లు నిర్వహి ంచడా న్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు.