calender_icon.png 25 September, 2024 | 6:06 AM

హైదరాబాద్‌లో ఐటీ అధికారుల సోదాలు

25-09-2024 12:38:46 AM

  1. కూకట్‌పల్లి రెయిన్‌బో విస్టాస్‌లో బొల్లా రామకృష్ణ నివాసంలో తనిఖీలు 
  2. స్టార్ పవర్ సంస్థ డైరెక్టర్ రాజేశ్ ఇంట్లోనూ.. 
  3. ఎనిమిది ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు
  4. అనుమానస్పద లావాదేవీల పత్రాలు స్వాధీనం 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఆదాయ పన్ను ఎగవేత నేపథ్యంలో ఐటీ అధికారులు హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో మంగళవారం ఏక కాలం లో సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లిలో ని రెయిన్‌బో విస్టాస్‌లోని ‘ఐ’ బ్లాక్‌లో ఉం టున్న బొల్లా రామకృష్ణ నివాసంలో తనిఖీలు చేపట్టారు.

రామకృష్ణకు చెందిన స్టార్ ఫైనాన్స్, న్యూస్ ఛానల్ ఆఫీస్ సహా హాస్సిటల్, రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో తనిఖీలు కొనసాగాయి. 50 మందికిపైగా అధికారు లు ౮ బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. బషీర్‌బాగ్‌లోని పైగా ప్లాజాలోని ఫైనాన్స్ ఆఫీస్, కూకట్‌పల్లి, మూసాపేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాదాపూర్‌లోని కార్యాలయాల్లో సోదాలు జరిగాయి.

ఈ కంపెనీలకు చెందిన ఆర్థిక వ్యవహారాలపై ఆరా తీశారు. అనుమానాస్పద లావాదేవీలకు చెందిన పలు డ్యాకు మెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. బీఆర్‌కే ఇన్‌ఫ్రా అధినేత బొల్లా రామకృష్ణకు ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోపా టు ‘సీఎం పెళ్లాం’ అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

రామకృష్ణ నివాసం ఉంటున్న రెయిన్‌బో విస్టాస్ సముదాయంలోని ‘ఏ’ బ్లాక్ నివాసముంటున్న స్టార్ పవర్ సంస్థ డైరెక్టర్ రాజేశ్ ఇంట్లో కూడా సోదాలు చేసినట్టు సమాచారం. వీరిద్దరూ వ్యాపార వ్యవహారాల్లో భారీగా ఆదా య పన్ను ఎగవేతకు పాల్పడిన కారణంగా సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.

గట్టు రాజేశ్ చాలాకాలంగా ఈ గృహ సముదాయంలోనే ఉంటుండగా రామకృష్ణ ౪ నెలల క్రితమే రెయిన్‌బో విస్టాస్‌లోకి మకాం మార్చినట్టు స్థానికులు చెప్తున్నారు. సోదాలు పూర్తయిన అనంతరం ఐటీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.