17-04-2025 07:52:58 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో గురువారం అనుమానితుల ఇళ్ళను ఎస్సై గంగారం తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూసారం కోల్పోయి పంట దిగులు తగ్గుతుందని రైతులకు వివరించారు. లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఏ గ్రామంలో అయినా నకిలీ పత్తి విత్తనాలు అమ్మిన, కొన్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.