calender_icon.png 28 February, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం

28-02-2025 01:43:41 AM

నాగర్ కర్నూల్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినం రోజు వెల్డండ మండలం గుండాల అంబ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాళ్ళో గుండం లో స్నానం చేస్తూ కేపీ తాండ గురుకుల విద్యార్థి  ప్రమాదవశాత్తు గల్లంతైన ఘటనలో విద్యార్థి కోసం రెండవ రోజు గురువారం ఫైర్ సిబ్బందితో పాటు ఎన్టీఆర్‌ఎఫ్ రె స్క్యూ టీం సభ్యులు విద్యార్థి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు సప్త గుండం లో ని నీటినంతా తోడినప్పటికీ పేరుకుపోయిన బురద కారణంగా విద్యార్థి ఆచూకీ దొరకలేదని రెస్క్యూ టీం సభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం మన్ననూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళ ఉమేష్(17) అనే విద్యార్థితో పాటు మరో నలుగురు విద్యార్థులు  స్నానం చేస్తుండగా గల్లంతైన విషయం తెలిసిందే.