జింబాబ్వే సీనియర్ క్రికెటర్ సీన్ విలియమ్స్ అంతర్జాతీయ టీ20 క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన టీ20 మ్యాచ్ తన కెరీర్లో ఆఖరి మ్యాచ్ అని పేర్కొన్నాడు. ఇకపై వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతానని మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు. 2006లో టీ20 క్రికెట్లో తొలి మ్యాచ్ ఆడిన సీన్ విలియమ్స్ మొత్తంగా 81 మ్యాచ్లు ఆడి 1691 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలున్నాయి. బంతితోనూ రాణించిన విలియమ్స్ 41 వికెట్లు పడగొట్టాడు.