calender_icon.png 19 March, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా దుస్తులకు సీల్ టెండర్స్ ఆహ్వానం

19-03-2025 07:01:32 PM

ఐటీడీఏ పీవో రాహుల్...

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన సంక్షేమ క్రీడ పాఠశాలలకు కావలసిన క్రీడా దుస్తులు (టీ షర్ట్, షార్ట్, ట్రాక్ షూట్) సరఫరా నిమిత్తం సీల్డ్ షార్ట్ టెండర్లు కోరుతున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి షార్ట్ టెండర్ నందు పాన్ కార్డు, టిన్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాత కలిగిన వారు టెండర్ లో పాల్గొనవచ్చునని ఆయన అన్నారు.

 కావున ఆసక్తిగల టెండర్ దారులు ఉపసంచాలకులు (గి.సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం నుండి తేదీ 20-03-25 నుండి 24-03-25, మధ్యాహ్నం 12 గంటల వరకు (అన్ని పని దినములలో, సెలవు రోజులలో) షార్ట్ టెండర్ షెడ్యూల్స్ పొందవచ్చునని, టెండర్ షెడ్యూల్ ధర రూ.1000/-ఉప సంచాలకులు (గి. సం.) శాఖ ఐటీడీఏ భద్రాచలం పేరున ఎస్బిఐ భద్రాచలం నందు చెల్లుబాటు అయ్యే విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించి పొందవచ్చునని, ధరావత్ సొమ్ము రూ.1 లక్ష-డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో షార్ట్ టెండర్ షెడ్యూల్ తో పాటుగా టెండర్ బాక్స్ నందు సమర్పించాలని ఆయన అన్నారు. 

పూర్తి చేసిన షార్ట్ టెండర్ షెడ్యూల్ ఆఖరి తేదీ 24-03-25 మధ్యాహ్నం 1:00 గంట లోపు ఉపసంచాలకులు, (గి.సం.) శాఖ, ఐటీడీఏ భద్రాచలం వారి కార్యాలయం టెండర్ బాక్స్ నందు సమర్పించాలని, తేదీ 24-03-25 సాయంత్రం 3:00 గంటలకు ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ భద్రాచలం సమావేశ మందిరంలో హాజరైన టెండర్లదారుల సమక్షంలో తెరిచి తుది నిర్ణయం తీసుకోబడునని, టెండర్ దారులు శాంపిల్స్ తీసుకొని రావాలని, సెలవు దినములలో కూడా ఆఫీసు తెరిచి ఉంచబడునని, కావలసినవారు దరఖాస్తులను పొందవచ్చునని ఆయన అన్నారు.