- బిల్లుకు గవర్నర్ ఆమోదం
- వీలైనంత త్వరగా చట్టాన్ని అమలులోకి తెస్తాం
- ప్రతి రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ అధికారిని నియమిస్తాం
- గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలు
- ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో భూ సమస్యలేని గ్రామం లేదు
- రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): భూభారతి చట్టం-2025కి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. వెనువెంటనే ప్రభు త్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఈ చట్టాన్ని తొందర్లోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
రాష్ట్ర ప్రజలకు మెరుగైన, సమగ్రమైన రెవెన్యూ సేవలను సత్వరమే అందించాలన్న ఆశయంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట రెవెన్యూ, హౌ సింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ర్టంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూభారతి చట్టాన్ని రూ పొందించామని, ఈ చట్టాన్ని ఆమోదించిన గవర్నర్, సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, సిబ్బందితో పాటు చట్టం తీసుకురావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
గవర్నర్ ఆమోదించిన భూభారతి బిల్లు కాపీని మంత్రి పొంగులేటికి గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ చట్టం-2020 వల్ల తెలంగా ణ రాష్ర్టంలో సామాన్య ప్రజలు, రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, ఈ చట్టం తీసుకువచ్చి మూడు సంవత్సరాలు గడచినా, విధివిధా నాలను రూపొందించలేదన్నారు.
ధరణి చట్టం వల్ల తెలంగాణలో భూ సమస్యలేని గ్రామం లేదని, గత ప్రభుత్వం తమ వ్యక్తిగత స్వార్ధం కోసం, ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసిందిన మంత్రి పొంగులేటి మండిపడ్డారు. గతంలో కొందరి గుప్పిట్లో.. కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను.. ఇప్పుడు గ్రామస్థాయి వరకు అందించడానికి తమ ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపట్టిందన్నారు.
గ్రామాలలో రెవెన్యూ పాలనను అందించడానికి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని, ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా కొలిక్కివచ్చిందని మంత్రి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగు ణంగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వ ఆలోచనలకు అను గుణంగా రెవెన్యూ విభాగం పనిచేయాలి, అందుకు రెవెన్యూ వ్యవస్థ్దను ప్రజలకు చేరువచేయాలన్నదే ఈ ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు.
ప్రజాపాలనలో ప్రజలు కేంద్రబిందువుగా ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు ఉం టాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూశాఖలో అధికారులు, సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరించి సామాన్యుల సంక్షేమమే ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని, ఈ చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు.