- మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
- ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం
ముషీరాబాద్, ఆగస్టు 2 : డ్బుభై ఏండ్ల తరువాత ఎస్సీలకు స్వతంత్ర ఫలాలు అందుతున్నాయని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తమకు ఇప్పడు నిజమైన స్వతంత్రం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పును హర్షిస్తూ శుక్రవారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మోత్కుపల్లి నర్సింహులు క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు. త్వరలో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని కలుస్తానని ఆయన తెలిపారు.
సుప్రీం తీర్పు హర్షణీయం..
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును హర్షిస్తూ శుక్రవారం వీఎస్‌టీ చౌరస్తాలో ఎమ్మెల్యే ముఠా గోపాల్.. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగులు, ప్రధాన కార్యదర్శి జ్ఞాని, నాయకులు సాయిలు, కిషోర్, శ్రీనివాస్, సత్తి, రామస్వామి, హరీష్, సురేష్, శ్రీను నేత, అస్లాం తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా భోలక్‌పూర్ డివిజన్‌లోని ఇందిరానగర్‌లో ఎమ్మార్పీఎస్ భోలక్‌పూర్ అధ్యక్షుడు అమ్ముగూడెం దశరథ్ ఆధ్వర్యంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్‌ల విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గండి కృష్ణ మాదిగ, ఎల్లయ్య మాదిగ, వినయ్‌రావు మాదిగ, ఎల్లయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.