12-02-2025 02:11:08 AM
కరీంనగర్, ఫిబ్రవరి11(విజయక్రాంతి): మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబా ద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవ ర్గాల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది.
పట్టభద్రుల నియోజకవర్గానికి సంబం ధించి మొత్తం 100 మంది నామినేషన్ వేయగా 32 మంది నామినేషన్లు వివిధ కార ణాల చేత ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. సరైన ఫార్మాట్‌లో ఉన్న 68 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి.
ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబం ధించి మొత్తం 17 మంది నామినేషన్లు దాఖ లు చేయగా ఒకరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. 16 మంది నామినేషన్లు ఆమో దించారు.
మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలా బాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరి యంలో నామినేషన్ వేసిన వారి సమక్షంలో నిర్వహించారు.
నిబంధనల ప్రకారం పరిశీలన ప్రక్రియ:రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి
ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మా ట్లాడుతూ అభ్యర్థులు నామినేషన్ల సమర్పిం చిన సందర్భంలో ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. నియమ నిబంధనలను అనుసరించి నామినేషన్ల పరి శీలన ప్రక్రియ జరిగిందని తెలిపారు.
సరైన ఫార్మాట్లో సమర్పించని నామినేషన్లను తిర స్కరించినట్లు తెలిపారు. అభ్యర్థుల సందే హాల నివృత్తి కోసం నామినేషన్ తీసుకునే తేదీల్లో హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. నామినేషన్ల పరిశీల న ప్రక్రియ అనంతరం అభ్యర్థుల నుండి అభ్యంతరాలు కోరారు. తిరస్కరణపై అభ్యం తరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృ త్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సం జయ్ రామన్, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్, ఏవో నరేం దర్, తహసిల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.