హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 (విజయక్రాంతి): కాంట్రాక్టు పద్ధతిన స్టాఫ్‌నర్స్‌గా పనిచేయడానికి దరఖాస్తు చేసుకున్నవారిలో మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన బుధవారం హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఉం టుందని డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. ఇప్పటికే పోస్టుల దరఖాస్తుల మెరిట్ లిస్టు (3842)ను డీఎంహెచ్‌వో అధికారిక వెబ్‌సైట్‌లో పొందు పర్చినట్టు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 78 పోస్టుల కోసం 1:2 నిష్పత్తిలో ప్రొవిజనల్ ఎంపిక అభ్యర్థుల జాబితాను ఇప్పటికే www.hyderabad. telangana.gov.inలో ఉంచినట్టు తెలిపారు. 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు మాత్రమే వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో బుధవారం ఉద యం 10.30 గంటలకు సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్, నాలు గో అంతస్తులోని డీఎంహెచ్‌వో కా ర్యాలయానికి రావాలని చెప్పారు.