- వీడియోకాల్ అనంతరం బాలికను బెదిరించే యత్నం
- పీఎస్‌లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు
- కటకటాల వెనుక మైనర్ బాలుడు
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగష్టు25 (విజయక్రాంతి): జిల్లా కేంద్రానికి చెందిన బాలిక (13)ను ఓ బాలుడు(16) మాయమాటలు చెప్పి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫి ర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లాకి చెందిన మైనర్ బాలుడు మత్త్తు పదార్థాలకు అలవాటు పడి చెడుతిరుగుళ్లకు బానిసయ్యా డు. ఈ క్రమంలో జిల్లాకేంద్రానికి చెందిన ఓ పదమూడేళ్ల బాలికతో మెదట స్నేహం చేసి.. ఆబాలిక ఫోన్ నంబర్ తీసుకున్నాడు. అయి తే మొదట ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి వీడియోకాల్ చేయాలని ఒత్తిడి చేసేవాడు.
కొన్నిరోజుల తర్వాత బాలిక వీడియో కాల్ చేయడంతో మాట్లాడతున్న క్రమంలో బాలు డు స్క్రీన్ షాట్ తీసి మరుసటి రోజు నుంచి బాలికను లొంగదీసుకునేందుకు ఒత్తిడి చే యడం మొదలు పెట్టాడు. బాలిక ఇంట్లో ని త్యం భయం భయంగా ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. గట్టిగా అడగటం తో అసలు విషయం చెప్పింది. దీంతో కుటు ంబ సభ్యులు సాక్షాధారాలతో సహా బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసు లు.. జేఎఫ్.సీఎం బెల్లంపల్లి ఇన్‌చార్జ్జి జువనై ల్ జస్టిస్ బోర్డ్ ఎదుట హాజరుపరిచారు. బా లుడిని పిల్లల సంరక్షణ గృహానికి పంపించినట్లు తెలిపారు. విద్యార్థి దశలో పిల్లల నడవడికపై తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని డీఎస్పీ సూచించారు.