calender_icon.png 25 September, 2024 | 9:58 AM

కారుపై గీతలు.. 8 మంది చిన్నారులపై కేసు

25-09-2024 01:17:20 AM

కానిస్టేబుల్ ఫిర్యాదు

కేసు నమోదు చేసిన హనుమకొండ పోలీసులు

హనుమకొండ, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్‌లోని టవర్ అపార్ట్‌మెంట్‌లో పదుల సంఖ్యలో కుటు ంబాలు నివాసముంటున్నాయి. ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ కానిస్టేబుల్ సైత ం ఉంటున్నాడు. కొద్దిరోజుల క్రితం అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కి ంగ్ ప్రదేశంలో ఉంచిన తన సంబంధీకుల కారుకు గీతలు పడ్డాయి.

పె యింట్ కూడా చెదిరిపోయింది. ఈ సంఘటన జరిగిన నెల రోజుల తర్వాత(ఆగస్టు 5న) సదరు కానిస్టేబుల్ తన కారును 8 మంది చిన్నారులు డామేజ్ చేశారని, కారుపై తన కూతురును తిడుతూ బూతులు రాశారని స్థానిక సుబేదారి పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఉన్నతాధికారులతో స్థా నిక ఎస్సైపై ఒత్తిడి తెచ్చి 8 మంది చి న్నారులపై కేసు నమోదు చేయించా డు.

వారంతా 8ఏళ్లలోపు వారే. కేసు నమోదు చేసిన నెల రోజుల తర్వాత తమ పిల్లలపై కేసు నమోదు అయిన ట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

8 ఏళ్ల లోపు చిన్నారులపై ఏకంగా కేసులు నమోదు చేయడం నెల రోజుల త ర్వాత ఆ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడాన్ని పలువు రు ఆక్షేపిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురైన సదరు పోలీసులు ఇరు వర్గాల మధ్య రాజీ ప్రయత్నా లు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.