calender_icon.png 26 November, 2024 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కౌట్స్ అండ్ గైడ్స్ తో విద్యార్థుల్లో దేశభక్తి పెంపొందుతుంది

25-11-2024 10:59:34 PM

సింగరేణి ఏరియా జిఎం దేవేందర్

మందమర్రి (విజయక్రాంతి): స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా విద్యార్థి దశలోనే విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ అలవడుతుందని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ ఆన్నారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన "స్టాండర్డ్ జడ్జింగ్ క్యాంప్ స్కౌట్స్ అండ్ గైడ్స్" కార్యక్రమంను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలలో క్రమశిక్షణను పెంపొందించి దేశంపట్ల భక్తిశ్రద్ధలతో పాటు స్కౌటింగ్ స్కిల్స్,టీం వర్క్, ఆత్మ విశ్వాసం పెంపొందించు కోవడం లాంటివి శిక్షణ శిబిరంలో నేర్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

నేటి నుండి మూడు రోజుల వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో గోదావరిఖని, శ్రీరాంపూర్, మందమర్రి, గోలేటి, నుండి 65 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సింగరేణి హై స్కూల్ హెడ్మాస్టర్ పురుషోత్తం, మాస్టర్స్ భాస్కర్, శక్తి కుమార్ పొద్దర్, కృష్ణ కుమార్, శ్రీనివాస్, శ్రావణ్, కల్పలత, కరిష్మా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.