నార్త్‌సౌండ్: బ్రెండన్ మెక్‌ములెన్ (31 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశామే హద్దుగా చెలరేగడంతో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో రెండో విజయం నమోదు చేసుకుంది. గ్రూప్ భాగంగా జరిగిన పోరులో స్కాట్లాండ్ 7 వికెట్ల తేడాతో ఒమాన్‌పై విజయం సాధించింది. మొదట ఒమాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 150 పరుగులు చేసింది. ప్రతీక్ (54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బ్రెండన్ మెక్‌ములెన్ మెరుపు అర్ధశతకం బాదగా.. జార్జి మున్సీ (20 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లం డ్ వంటి జట్లు ఉన్న గ్రూప్ మూడు మ్యాచ్‌లాడిన స్కాట్లాండ్ 5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండటం విశేషం.