calender_icon.png 7 March, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూటీని ఢీకొట్టి ఆపై దాడి గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఘటన

22-01-2025 12:32:44 AM

శేరిలింగంపల్లి, జనవరి 21 (విజయక్రాంతి): మద్యం మత్తులో ముందున్న స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా స్నేహితులతో కలిసి  బాధితునిపైనే విచక్షణ రహితంగా దాడి చేసి ఓ వ్యక్తిని గాయపర్చారు కొందరు యువకులు.ఈ ఘటన గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొండాపూర్ ఏఎంబీ మాల్ వైపు నుండి మజీద్ బండ వైపు స్కూటీ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని మెర్సిడీస్ బెంజ్ కారు (టీఎస్ 07 ఆర్ ఆర్ 4455 )లో వస్తున్న యువకులు ఢీ కొట్టారు.దీంతో అతను పక్కనే ఉన్న ఫుట్ ఒక్కసారిగా ఎగిరి పాత్ పై పడి పోయాడు.

గాయపడి ఫుట్ పాత్ పై పడి ఉన్న బాధితుడి వద్దకు తిరిగి క్రెటా కారు (టీఎస్ 07 ఈఎక్స్ 0079 )లో తన స్నేహితులతో కలిసి వచ్చి మరోసారి బాధితుడిపై దాడికి తెగబడ్డారు.తన మెర్సి డీస్ బెంజ్ కారుకే డ్యామేజ్ చేస్తావా అంటూ బండ బూతులు తిడుతూ ఇష్టా రీతిగా దాడికి పాల్పడ్డారు.

ఈ సంఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. హైదరాబాద్  మహా నగరంలో నడిరోడ్డుపై వ్యక్తిని కొడుతుంటే పోలీసులు పట్టించుకోలేదని, అసలు నగ రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.