మహదేవపూర్, సెప్టెంబర్ 11: మేడిగడ్డ ప్రాజెక్టు వరద ప్రవాహన్ని ఏడీసీసీ పరికరంతో పుణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం బుధవారం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌కు ఏర్పడిన పగుళ్లను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డకు వచ్చే వరద ప్రవాహన్ని అంచనా వేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు పుణేకు చెందిన శాస్త్రవేత్తల బృందం లక్నవరం నుంచి తెచ్చిన ప్రత్యేక బోటుకు ఏడీసీ సీ (అకౌస్టిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫెల్లర్) పరికరాన్ని అమర్చారు. కాళేశ్వరం నుంచి మేడి గడ్డ బరాజ్ వరకు ప్రతేక బోటులో ప్రయాణించి వరద ప్రవాహ వేగాన్ని పరిశీలించారు.