calender_icon.png 4 March, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ సమన్వయంతో ముందుకుసాగాలి

03-03-2025 07:20:06 PM

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పొలాస ఇన్చార్జి సహ వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీలత...

బెల్లంపల్లి (విజయక్రాంతి): శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస ఇన్చార్జి సహ వ్యవసాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీలత అన్నారు. బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం 8వ శాస్త్రీయ సలహా మండలి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు వ్యవసాయ సూచనలు అందించారు. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ జిల్లాలలోని కృషి విజ్ఞాన కేంద్రం,ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు గత సంవత్సరం చేపట్టిన పరిశోధన అంశాల మీద, వచ్చే వానాకాలం, యాసంగిలో చేపట్టబోయే పరిశోధన అంశాల మీద సమీక్ష నిర్వహించి సస్యరక్షణ సలహాలు, పంటల సాగు విధానాలపై సూచనలు చేశారు.

శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ మరింత సమన్వయంతో ముందుకు సాగుతూ రైతులకు వ్యవసాయ సాంకేతికతను మరింత చేరువ చేయాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా ప్రాంతాలకు అనుకూలంగా అభివృద్ధి చేసిన పరిశోధనా ఫలాలు ప్రతి ఒక్క రైతుకు చేరుకునేలా ప్రణాళికాబద్దంగా సాంకేతిక కార్యక్రమాలను రూపొందించి వ్యవసాయశాఖ సహకారంతో రైతులకు చేరవేయాలన్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కోట శివకృష్ణ మాట్లాడుతూ... భవిష్యత్తులో వ్యవసాయ సాంకేతికతను రైతులకు మరింత చేరువ చేసే విధంగా కృషి చేస్తామన్నారు.

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్ నాయక్, ఈఈఐ, హైదరాబాద్, డాక్టర్ రాం ప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త (ఎంటమాలజీ), హెడ్, ఏ ఆర్ ఎస్ ఆదిలాబాద్ డాక్టర్ శ్రీధర్ సిద్ధి, సైంటిస్ట్ (ప్లాంట్ బ్రీడింగ్), మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, నాబార్డ్ డిడియం. వీరభద్రం, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, ఏరువాక కేంద్రం, కరీంనగర్ శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞానకేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలు, శాస్త్రీయ సలహా మండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.