calender_icon.png 20 November, 2024 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపవాసం గుట్టు తెలిసింది.. అద్భుతమైన ప్రక్రియ.. ఆటోఫాగీ !

05-08-2024 05:36:17 PM

శతాబ్దంలో గొప్ప ఆవిష్కరణ యాపిల్ ఫోన్ కనిపెట్టడం లేదా కంప్యూటర్ కనిపెట్టడం కాదు. ఆ శతాబ్దం మాత్రమే కాకుండా, భూమి మీద జీవం పుట్టిన దగ్గర నుంచి శాస్త్రవేత్తలు చేసిన అత్యంత గొప్ప ఆవిష్కరణ అంటే, ఉపవాసం వెనక ఉన్న ఆటోఫాగీ ప్రక్రియని కనిపెట్టడం. ఇది శరీర కణాల శుద్ధి, ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన ప్రక్రియ. ఈ ఆవిష్కరణ చేసిన యొషినోరి ఒహ్సుమి కృషికి నోబుల్ ప్రైజ్ సరిపోదు.. అంతకు మించి ఏమైనా ఇవ్వాలి. అన్ని మతాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. ప్రతీ ఏకాదశికి ఉపవాసం చేసిన  తెల్లారి ఎంజైములు, చక్కగా సమయానికి  విడుదల అవుతాయి. కణాలలోని పవర్ హౌస్ మైటోకాండ్రియాలో నిలువ ఉన్న శక్తి సరిగ్గా వినియోగమౌతుందని వివరించారు. అంతే కాక ప్రతీ రోజు సాయంత్రం 7గంటలలోపే భోజనం ముగించడం విధిగా పాటించాలని పరిశోధన సూచిస్తోంది.