calender_icon.png 6 February, 2025 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైన్స్ టాలెంట్ టెస్ట్..

06-02-2025 05:29:18 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు గురువారము 28 జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల(బాలుర) గురుకుల విద్యాలయంలో (సైదాపూర్ శాఖ) పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆఖ్యారపురాని మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీయుటకు టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని, ప్రతి సంవత్సరము ఈ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడులు ఇవ్వడము, టాలెంట్ టెస్టులు నిర్వహించడం అభినందనీయమని తెలుపుతూ, ట్రస్ట్ చేసే సేవ కార్యక్రమాలను కొనియాడారు.

అనంతరం మంచి ప్రతిభ కనబరిచిన మొదటి నలుగురు విద్యార్థులకు బహుమతులను ప్రిన్సిపాల్ ఆఖ్యారపురాణి, ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ (రిటైర్డ్ టీచర్) బహుమతులు అందజేశారు. బహుమతులు పొందిన కే అశ్వదు, ఎం అరవింద్, ఏ సిద్ధార్థ, జి వినాయకులకు శంకర్ నారాయణ డిక్షనరీలు, మెమొంటోలు అందజేశారు.