calender_icon.png 11 January, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి వ్యక్తి జీవితంలో సైన్స్ అవసరం

05-01-2025 12:00:00 AM

కలెక్టర్ శిక్తా పట్నాయక్                   

నారాయణపేట, జనవరి 4 (విజయక్రాంతి) : ప్రతీ వ్యక్తి జీవితంలో సైన్స్ చాలా అవసరమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా విద్యా వైజ్ఞానిక ఉత్సవం జరిగింది. రెండవ రోజు శనివారం నాడు ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... నేను చూసిన చాలా ప్రదర్శనలు చాలా బాగున్నాయని, చక్కటి ప్రదర్శనతో పాటు అర్థమయ్యే విధంగా వివరించారని కొనియాడారు.

విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు తిలకించడానికి జిల్లా నలుమూలల నుండి 8 వేల మంది విద్యార్థులు హాజరయారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజులు, జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి యోగానంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత, జిల్లా సైన్సు అధికారులు భాను ప్రకాష్, కనకప్ప, యాదయ్య శెట్టి, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీనివాస్, నాగార్జున రెడ్డి, సీఎంఓ రాజేంద్ర కుమార్, ఎస్జిఎఫ్ సెక్రెటరీ గొడుగు నరసింహులు,  పిఆర్టియు జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణారెడ్డి, ఎంఈఓ లు బాలాజీ, బాలకృష్ణప్ప, తదితరులు పాల్గోన్నారు.