calender_icon.png 4 March, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్య జీవితంలో సైన్స్ విడదీయని భాగం..

04-03-2025 06:56:14 PM

ప్రొఫెసర్ రామస్వామి..

కాగజ్ నగర్ (విజయకాంతి): మానవుని నిత్య జీవితంలో సైన్స్ విడదీయరాన్ని భాగమని ప్రొఫెసర్ రామస్వామి అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, కళాశాల ఆధ్వర్యంలో సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రొఫెసర్లు రామస్వామి, కిషన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారత దేశంలో అనేక పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. ఆధునిక యుగములో సైన్స్ వేగంగా పురోగతి సాధిస్తుందన్నారు.

విద్యార్థి దశ నుండే శాస్త్రీయ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. సైన్స్ ప్రదర్శనలను తిలకించారు ఉత్తమ ప్రదర్శనలకు, క్విజ్, సాంస్కృతిక పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహం, అకాడమిక్ కోఆర్డినేటర్ జనార్ధన్ అధ్యాపకులు రాజేశ్వర్, శారద, దేవేందర్, రోజా మేరీ, కృష్ణవేణి, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.