calender_icon.png 29 March, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలికి తీసేందుకే సైన్స్ ఫెయిర్

26-03-2025 12:18:29 PM

ఖానాపూర్ మండల విద్యాధికారి ప్రేమ్ సాగర్

ఖానాపూర్, (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే, సైన్స్ ఫెయిర్(Science fair), ఫుడ్ ఫెస్టివల్ ,నిర్వహిస్తున్నామని, ఖానాపూర్ మండల విద్యాధికారి ప్రేమ్ సాగర్(Khanapur Mandal Education Officer Prem Sagar) అన్నారు. మండలంలోని బీర్నంది గ్రామంలోని, జడ్పీఎస్ఎస్ పాఠశాల లో బుధవారం సైన్స్ ఫెయిర్ ,ఫుడ్ ఫెస్టివల్, నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, పలువురు విద్యార్థులు డస్ట్ బిన్, పగలు రాత్రికి సంబంధించిన ప్రయోగం, తడి, పొడి, పొలాలలో నీటిని అదుపు చేసే యంత్రం, ఎయిర్ గన్ వంటి ప్రయోగాలతో పాటు ,ఇంటి వద్ద చేసుకుని వచ్చిన పదార్థాలను ప్రధర్షించడం జరిగింది.

దాంతోపాటు, వస్తు మార్పిడి నుంచి, ప్రస్తుతం వాడుతున్న డిజిటల్ మనీ వరకు, ఏ విధంగా అభివృద్ధి చెందినదో, వంటి ప్రయోగాలను విద్యార్థులు ప్రదర్శించారు .ఈ కార్యక్రమంలో, చైర్మన్ మునీసుల నీల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి ఎల్ వి ప్రసాద్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, పాఠశాల సిబ్బంది ఏ గంగన్న, జై వనజ ,ఎం ప్రకాష్ ,నారాయణ, ప్రసీన్ జీర్, రాఘవేందర్ ,శ్రీదేవి, కారోబార్ హరీష్ ,పెట్టెం సుధాకర్, సురేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.