మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్
జిల్లాలో ఇన్‌స్పైర్ ప్రదర్శనలు ప్రారంభం
మెదక్, నవంబర్ 29 (విజయక్రాంతి): విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికితీసేందుకు ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మెదక్ లోని వెస్లీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్, ఉపాధ్యాయ సంఘా ల ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్, మ్యాథ్స్ విషయాలను ఇష్టపడి చదివితే, నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందని తెలిపారు. నేటి బాలలే భావిభారత శాస్త్ర వేత్తలని, ఆ దిశగా విద్యార్థుల ఆలోచనలు ఉండేలా ప్రోత్సహించాలన్నారు. ఇన్స్‌స్పైర్‌లో మొత్తం 337 అంశాల్లో విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసినిరెడ్డి, డీఈవో రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి పాల్గొన్నారు.