calender_icon.png 28 February, 2025 | 11:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణవేణి హై స్కూల్లో సైన్స్ ఫెయిర్..

18-02-2025 06:47:06 PM

విద్యార్థి దశ నుండే సైన్సు పట్ల అవగాహన కలిగి ఉండాలి..

ఆధారాలతో నిరూపణ చేసేదే సైన్స్..

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సైన్స్ విజ్ఞాన శాస్త్రం అనేది రుజువుతో నిరూపణ చేసేదని, ఆధారం లేకుండా ఎవరో చెప్పారని పూర్వికులు అనుసరిస్తున్నారని నమ్మేది కాదని, సైన్స్ కు నిరూపణ అవసరమని ఎల్లారెడ్డి తాహాసిల్దార్ మహేందర్ అన్నారు. మంగళవారం నాడు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలువురు అధికారులు హాజరై విద్యార్థులు ఆవిష్కరించిన వస్తువులను, పరికరాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులలో దాగి ఉన్న విజ్ఞాన నైపుణ్యాన్ని వెతికి తీయడానికి పాఠశాల యజమాన్యం ఈ సైన్స్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు.

విద్యార్థులు మూఢనమ్మకాలు నమ్మకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోడానికి ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థి దశ నుండి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.విద్యార్థులు చదువుతోపాటు వారికి ఉన్న విజ్ఞానాన్ని ఉపయోగించి తయారుచేసిన వస్తువులను పరికరాలను అద్భుతంగా ఉన్నాయని విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు ఎస్ఐ మహేష్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.