28-02-2025 10:05:32 PM
ఎల్బీనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా చైతన్యపురిలోని అమేరికిడ్స్ స్కూల్ లో శుక్రవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని అమేరికిడ్స్ ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన వైజ్ఞానిక, పర్యావరణ నమూనాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రదర్శనపై విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.