రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థుల్లోని సృజన్మాతకత ప్రతిభను వెలికి తీయడానికే వైజ్ఞానిక ప్రదర్శనలు అని రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి ఇన్‌స్పైర్, రాష్ట్ర బాల వైజ్ఞానిక ప్రదర్శనను అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి విద్యార్థుల ప్రయోగాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి జీవితంలో స్థిరపడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఎంఈవో నాగేశ్వర్‌రావు, పీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు కుషాల్, తపాస్ జిల్లా కార్యదర్శి సంతోష్, పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు నార్ల అరుణ్, కృష్ణారెడ్డి, నార్ల సురేష్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.