calender_icon.png 1 March, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవీ పబ్లిక్ స్కూల్‌లో సైన్స్ డే

01-03-2025 12:29:18 AM

కామారెడ్డి ఫిబ్రవరి 28,(విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ వాసవి పబ్లిక్ స్కూల్ దోమకొండ లో నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా పాఠశాల ప్రిన్సిపాల్ రవీందర్ సర్ సివి రామన్ ఫొటోకి పూలమాల అలంకరించి గౌరవ వందనం సమర్పించారు. 

విద్యార్థినులు తయారు చేసిన, ప్రయోగపూర్వక ప్రాజెక్టులో, అందులో ఇండియన్ ఫెస్టివల్స్, వాటర్ ప్యూరిఫికేషన్, సాల్ట్ వాటర్ & ప్లేన్ వాటర్ మధ్య తేడా , జంక్ ఫుడ్ & హోం మేడ్ ఫుడ్ మధ్య తేడా , మొదలగు ప్రాజెక్టులు ప్రదర్శించడం జరిగిందని ప్రిన్సిపల్ రవీందర్ తెలిపారు. సైన్స్ క్విజ్, డ్రాయింగ్ కాంపిటీషన్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, మూఢనమ్మకాల నిషేదంపై ఏడవ తరగతి విద్యార్తులు రూపక ప్రదర్శన నిర్వహించారు.

నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ప్లాస్టిక్ కాలుష్య నివారణపై కథానిక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సైన్స్ ఉపాధ్యాయురాళ్ళు, ప్రిన్సిపాల్ రవీందర్  సైన్స్ డే ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ, సైన్స్ పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవీందర్, సైన్స్ ఉపాధ్యాయురాళ్ళు, ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.