28-02-2025 08:08:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ గురుకుల పాఠశాలలో సైన్స్ డే ను నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ డేనియల్ సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఏర్పాటు చేసి సమాజాభివృద్ధిలో సైన్స్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. సైన్స్ బోధిస్తున్న ఉపాధ్యాయులను సన్మానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.