- రూ.232 కోట్లతో అభివృద్ధి
- కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరాన్ని వైజ్ఞానిక ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. తార్నాకలోని సీఎస్‌ఐర్- ఐఐసీటీ వద్ద అత్యాధునిక సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ సైన్స్ సిటీని రూ.232.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు తెలిపారు. ఇంటరాక్టివ్ అండ్ ఇమర్సివ్ ఎగ్జిబిట్స్, ఆస్ట్రోనమీ అండ్ స్పేస్ సైన్స్ గ్యాలరీ, రోబోటిక్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్, త్రీడీ డిజిటల్ డోమ్ థియేటర్, వాక్-త్రూ అక్వేరియం, మోషన్ సిములేటర్, స్టూడెంట్ యాక్టివిటీ జోన్లు ఈ సైన్స్ సిటీలో ఉంటాయని వెల్లడించారు.
ఈ ప్రపంచ స్థాయి సైన్స్‌సిటీ తెలం గాణ యువతకు వాస్తవ అనుభవాలతో కూడిన విజ్ఞానాన్ని అందించి, ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోందన్నారు. ఇది ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలకు వేదికగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.