మంత్రి దామోదరకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు
సంగారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): జేఎన్‌టీయూలో విద్యార్థుల కు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సుల్తాన్‌పూర్‌లో ఉన్న జేఎన్‌టీయూ లోనూ సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీజీసీవోఎస్‌టీ) ఆధ్వర్యంలో రూ.6.65 కోట్లు మంజూరు చేశారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ సైతం సైన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సైన్స్ సెంటర్ మంజూరుతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు యూనివర్సిటీ విద్యార్థు లు కృతజ్ఞతలు తెలిపారు.