హైదరాబాద్: వరద సహాయక చర్యల కోసం సైజెన్ గ్రూప్ కంపెనీ విరాళం ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. కోటి విరాళం అందజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సైజెన్ కంపెనీ ప్రతినిధులు చెక్కును అందజేశారు. తెలంగాణలో భారీగా కురిసిన వర్షాలకు పలు జిల్లాలను అతలాకుతలం అయ్యాయి. దీంతో పలువురు ప్రముఖులు, నేతలు, కంపెనీలు వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.