01-04-2025 02:29:34 AM
ప్రముఖ దర్శకుడు మల్లిడి వశిష్ట సోదరుడు మల్లిడి కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఎంఎస్‌ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై కుశాల్ రాజును హీరోగా పరిచయం చేస్తూ స్కైఫై డ్రామాను తెరకెక్కించనున్నారు. డాక్టర్ లతా రాజు నిర్మిస్తున్నారు. జగపతిబాబు, పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిసుండగా, సినిమాటోగ్రాఫర్‌గా అమర్నాథ్ బొమ్మిరెడ్డి పనిచేస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్స్ వీవీ వినాయక్, మల్లిడి వశిష్ట, ఎస్వీ కృష్ణారెడ్డితోపాటు నిర్మాతలు అచ్చిరెడ్డి, బెల్లంకొండ సురేశ్, ఫైట్ మాస్టర్ జీవన్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.